Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరూ టైటిల్ నే చిన్నల్లుడి మూవీకి ఫిక్స్ చేశారు!

  • రాకేశ్ శశి దర్శకత్వంలో కల్యాణ్ 
  • కథానాయికగా మాళవిక నాయర్ 
  • నిర్మాతగా సాయి కొర్రపాటి
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ హీరోగా రాకేశ్ శశి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ విషయంలో మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా వున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా టైటిల్ 'విజేత' అని ఎనౌన్స్ చేస్తూ .. అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

 నిస్సహాయులకు అండగా నేనున్నానంటూ వాళ్లకి చేయూతనిస్తున్నట్టుగా ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. ఇతరుల ముఖంలోని ఆనందానికి కారకుడివైతే నువ్ సక్సెస్ అయినట్టే అనే అర్థం వచ్చేలా పెట్టిన క్యాప్షన్ ఆకట్టుకునేలా వుంది. గతంలో చిరూ చేసి ఘన విజయాన్ని సాధించిన 'విజేత' టైటిల్ తోనే ఆయన చిన్నల్లుడు చేస్తుండటం విశేషం. సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాకి, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చాడు.     
kalyan
malavika nair

More Telugu News